తెలంగాణ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన..

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన..

బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి


పయనించే సూర్యుడు అక్టోబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు, నేతలు , కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. దుర్గామాత మహిషాసురుడిపై సాధించిన విజయం ధర్మానికి, సత్యానికి, న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సేవాభావాన్ని పెంపొందించాలని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయ స్ఫూర్తితో ప్రజలంతా అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విజయదశమి స్ఫూర్తితో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ ఏలూరి కోరారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS