PS Telugu News
Epaper

విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులతో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం.

📅 06 Nov 2025 ⏱️ 4:03 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

రవాణా కమిషనర్ వారి ఆదేశాల మేరకు, నంద్యాల పట్టణ పరిధిలోని విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులతో జిల్లా రవాణా శాఖ అధికారి జి.వి. శివారెడ్డి మరియు ఉప జిల్లా విద్యా అధికారి శంకర్ ప్రసాద్ కలిసి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి జి.వి. శివారెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలకు చెందిన బస్సులు, వ్యాన్ల వంటి వాహనాలు నడపేటప్పుడు పాటించవలసిన రోడ్డు భద్రతా నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం సంభవించినప్పుడు విద్యార్థుల రక్షణ కోసం అనుసరించవలసిన చర్యలు, వాహనాల్లో తప్పనిసరిగా అమర్చవలసిన భద్రతా పరికరాలపై విపులంగా అవగాహన కల్పించారు.ఉప జిల్లా విద్యా అధికారి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యాసంస్థల యాజమాన్యం రవాణా శాఖ సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను అనుసరించి విద్యార్థులను పాఠశాలకు సురక్షితంగా తీసుకురావడం, తిరిగి వారి గమ్యస్థానాలకు భద్రంగా చేర్చడం విద్యాసంస్థల యాజమాన్యానికి పూర్తి బాధ్యత అని సూచించారు. ఈ సమావేశంలో మోటార్ వాహన తనిఖీ అధికారి జి. శ్రీకాంత్, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి జి. సుబ్బయ్య అలాగే నంద్యాల పట్టణంలోని వివిధ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Scroll to Top