సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్”
పయనించే సూర్యుడు నవంబర్ 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్
పేద ప్రజలు ఆపదలో ఉంటే ‘నేనున్నాను’ అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు 30 మంది లబ్ధిదారులకు 23 లక్షల 19 వేల 943 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎక్కువ ఆక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చే వారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, లేదా ఆరోగ్య పరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావల్సిన డబ్బులు లేకపోవడం, ,వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు నాకు విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని, అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేయించారన్నారు. అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 30 మంది లబ్ధిదారులకు 23 లక్షల 19 వేల 943 రూపాయల చెక్కుల రూపంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , ఓబుల్ రెడ్డి , సుబ్బయ్య , కామిని మల్లికార్జున , షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) ,తాటికొండ మహేష్ , కృపాకర్ , మారుతి ప్రసాద్ , జార్జ్ , వంటల గల భాస్కర్ రెడ్డి , సదాశివరెడ్డి , జాకీర్ తదితరులు పాల్గొన్నారు

