పయనించే సూర్యుడు,ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ:_ ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో రూ.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో ఈ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ముమ్మిడివరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ప్రజలకు మెరుగైన రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ,ఇతర మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.ముమ్మిడివరం పట్టణ అభివృద్ధికి ఇప్పటికే వివిధ కేంద్ర,రాష్ట్ర పథకాల ద్వారా నిధులు మంజూరయ్యాయని, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి వసతులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. HAM విధానంలో రూ.12 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడిందని,ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి ముమ్మిడివరం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కట్ట సత్తిబాబు, తాడి నరసింహారావు,చెల్లి అశోక్,జనసేన నగర పంచాయతీ అధ్యక్షుడు దుర్గ ప్రసాద్,కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
