PS Telugu News
Epaper

దేశాయి బీడీ కార్మికులను నిలువు దోపిడి చేస్తున్న దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపెనీ యజమానిపై చర్యలు తీసుకోవాలి

📅 06 Nov 2025 ⏱️ 5:45 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ ఏ వర్గంలో వేల్పూర్ మండలం

బీడీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జి.అరవింద్ డిమాండ్ చేశారు

తేదీ:6/11/2025 న వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ , జాన్కంపేట్ గ్రామంలో,, పోస్టర్స్ ఆవిష్కరణ,,

దేశాయి బీడీ కంపని యజమాన్యం చట్టానికి విరుద్ధంగా దేశాయి బీడీ కార్మికుల నిలువు దోపిడీ చేయడం సరైనది కాదని,,సంబంధించిన పోస్టర్స్ ని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో,, బీడీ కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది,,ఈ సందర్భంగా,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి జి.అరవింద్ మాట్లాడుతూ:
బీడీ కార్మికులకు అగ్రిమెంట్ ప్రకారం 251,97 పైసలు ఇవ్వాల్సింది పోయి , దేశాయి బ్రదర్స్ లిమిటెడ్ బీడీ కంపని యజమాన్యం, దేశాయి బీడీ కార్మికులకు చట్టానికి విరుద్ధంగా, 10, రూపాయలు తక్కువ ఇవ్వడం సరైనది కాదని,అట్లాగే, ప్రభుత్వం అనుమతి లేకుండా దేశాయి బీడీ యజమాన్యం దేశాయి బీడీ కార్మికులకు నాసిరకమైన తినుబండారాలు , చిప్స్ ప్యాకెట్లను అట్లాగే సీట్ డబ్బాలను దేశాయి బీడీ కార్మికులకు బలవంతంగా అంటగట్టడం సరైనది కాదని,,అట్లాగే, ముక్కుడు పల్గుడు దొడ్డు తునికాకు, 1000 బీడీలకు 600 గ్రాములు ఆకు వేయడం వల్ల, 600 బీడీలు మాత్రమే అవుతున్నవి మిగతా 400 బీడీలకు ,,,,ఆకు సరిపోక తనకు వస్తున్న బట్వాడ నుంచి ఆకు కొనుక్కొని తుట్టి నింపడం జరుగుతుంది, అట్లాగే, చాట్ పేరుతో కార్మికుల నుండి వెయ్యి నుండి రెండు వేల వరకు అదనంగా బీడీలు తీసుకోవడాన్ని నిలిపివేయాలని,
1000 బీడీలకు సరిపోయేంత మంచి తునికాకు ఇస్తూ,రోజుకు వెయ్యి బీడీల పని కల్పిస్తూ నెలకు 26,రోజుల పని ఇచ్చే విధంగా చూడాలని,నాన్ పి.ఎఫ్ కార్మికులకు పీ.ఎఫ్ నంబర్స్ ఇస్తూ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,, కోరడం జరిగింది,ఈ కార్యక్రమంలో,, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఏరియా నాయకులు ఎండి. నజీర్ ,చిట్టి లస్ముం బాయ్ , హగ్గు లక్ష్మి , చిట్టి సంధ్య , ఏ .సంధ్య , హగ్గు. గంగమనణి, దుబ్బాక. హర్ష , పచ్చల నడ్కుడ జే.రాజేశ్వరి, ఎన్. రజిత, బి.లావణ్య ,ఆర్. లలిత ,బొడ్డు. బాలమణి రాపెళ్లి. లలిత , బండారి గంగు,, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు,,

Scroll to Top