కస్తూరిబా గాంధీ బీసీ గురుకుల హాస్టల్ లో వైద్య శిబిరాలు
పయనించే సూర్యుడు నవంబర్ 6 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :గురువారం సులానగర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశానుసారం గ్రామాలలో వైద్య శిబిరాలు, ఆరోగ్య సమావేశాలు మరియు ఆదికర్మ యోగి గ్రామసభలు నిర్వహించడం జరిగింది ఈ శిబిరాలలో అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించడం జరిగింది టేకులపల్లి లోని కస్తూరిబా గాంధీ బిసి బాలుర హాస్టల్లో జరిగిన వైద్య శిబిరంలో వైద్యాధికారి పాల్గొని పిల్లలను పరీక్షించి అవసరమైన వారికి తగు చికిత్సను అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పిల్లలతో మాట్లాడుతూ చలికాలంలో చర్మ మరియు శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయని పిల్లలందరూ వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలని కోరారు ఈరోజు బొమ్మనపల్లి కుంటల్ల సులానగర్ సంపత్ నగర్ దుబ్బ తండా కొత్త తండా చింతోనిచలక తండా బోడు కోయగూడెం గంగారం టేకులపల్లి గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు సలహాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి ఆరోగ్య విస్తరణ అధికారి దేవ సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్ గుజ్జ విజయ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు హారిక ధరణి శైలజ ఇంద్రజ అమూల్య ఏఎన్ఎంలు మానస కమల రమా కుమారి కళావతి వీరభద్రమ్మ సులోచన స్వప్న వెంకటరమణ అరుణకుమారి సుజాత లక్ష్మీ బాయి చంద్రకళ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు