అశ్వాపురం రైల్వే స్టేషన్‌లో రైలు నిలుపుదల కల్పించాలని ఎమ్మెల్యే పాయం కి వినతి పత్రం.
వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ బానోత్ సదర్ లాల్. పయనించే సూర్యుడు, ఏప్రిల్ 22,అశ్వాపురం: అశ్వాపురం గ్రామ ప్రజల దశాబ్దాల కల అయిన రైల్వే స్టేషన్ కనెక్టివిటీ మరియు రైళ్ల నిలుపుదల అంశంపై అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి ప్రత్యేక విన్నపం చేశారు. ఈ సందర్భంగా వారు గత పదేళ్లుగా సాగిన కృషిని, ప్రస్తుత అవసరాలను వివరించారు.అశ్వాపురం గ్రామం నుండి వెళ్లిన సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న […]




