PS Telugu News
Epaper

అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

📅 14 Apr 2026 ⏱️ 2:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 15/04/26

డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని హరిజన సంఘం మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యాయ కన్వీనర్ బండిరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి సామాజిక అసమర్ధలు కుల వివక్షతలు ఆర్థిక వెనుకబడితనం వంటి అన్నిటిని సమూలంగా తొలగించేందుకు అంబేద్కర్ పోరాటం చేశాడు ప్రత్యేకంగా మహిళ హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన దృష్టి విశేషమైనది మహిళలకు ఆస్తి హక్కు కల్పించడానికి హిందు కోడ్ బిల్లు తీసుకు రావడం జరిగింది అంబేద్కర్ దృష్టిలో నిజమైన స్వేచ్ఛ అంటే రాజకీయ స్వతంత్రం మాత్రమే కాదు అది సామాజిక ఆర్థిక స్వేచ్ఛ ఆయన యువతకు చదువు సమీకరించు పోరాడు అనే నినాదం ఇచ్చారు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా వ్యవహరించి ప్రాథమిక హక్కుల కల్పనకు పౌరుల ఆర్థిక సామాజిక స్వేచ్ఛకు తోడ్పడినటువంటి మహనీయుడు ఈరోజు సార్వజనిన ఓటు హక్కు అనుభవిస్తున్నామంటే అంబేద్కర్ ప్రజలకు అందించిన వజ్ర ఆయుధంగా కొనసాగుతుంది భారత ప్రభుత్వం డాక్టర్ భీమ్రావు రాంజీకి మరణాంతరం 1990లో భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించింది
అంబేద్కర్ మతం కన్నా నైతికత గొప్పదని రాజకీయం కన్నా రాజ్యాంగం ఉన్నతమైనదని నమ్మడమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు మనం ఇవ్వగలిగిన నిజమైన గౌరవం జ్ఞానం లేని పోరాటం దిశ లేని ప్రయాణం వంటిదని అంబేద్కర్ భావించారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ మండల అధ్యక్షులు నేరెళ్ల సంతోష్ ఉపాధ్యక్షులు చీమలవార్ శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీలు సామల రాజు వన్జరి రాకేష్ యూత్ అధ్యక్షులు సిందే నితిన్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు తాటిపాముల శివకుమార్ సెక్రటరీ ఆరెకటిక మోతిలాల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆకుల రాకేష్ మరియు నాయకులు ప్రజలు పాల్గొన్నారు

Scroll to Top