భీంగల్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి శనివారం రోజున చలివేంద్రాన్ని ప్రారంభించారు
పయనించే సూర్యుడు 24 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో
ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. చలివేంద్రాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలv సౌకర్యార్థం బస్టాండ్ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కిరాణా వర్తక సంఘం యూనియన్ సభ్యులు వారి తరఫున మంచినీటిని ఉచితంగా సరఫరా చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని చైర్ పర్సన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట సతీష్. అంజుం ఆలీ. మేనేజర్ నరేందర్. వార్డ్ ఆఫీసర్స్. కిరాణా వర్తక యూనియన్ సభ్యులు రవి. సూరజ్.అనిల్. అభిలాష్. రాజు. నాయకులు దినేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు
