ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది
ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలీ
ఆర్టీసీ కార్మికుల సమ్మె కు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం
ఎం పవన్ చౌహాన్ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
నేటితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని,ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం,చేసి ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా కాలంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. కార్మికుల సమ్మెను అణిచివేయడానికి ప్రయత్నించడం కాకుండా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు.విద్యార్థి సంఘాలు ఎల్లప్పుడూ కార్మిక వర్గాల పక్షాన నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతు కొనసాగిస్తామని స్పష్టం గా తెలిజేస్తున్నాం