మాజీ సర్పంచ్ మెరుగు రాములు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన గంగన్నగూడ మాజీ సర్పంచ్ మెరుగు రాములు కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మెరుగు రాములు గారి సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
