PS Telugu News
Epaper

ఎర్రాయి చెరువు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

📅 24 Apr 2026 ⏱️ 5:45 PM 📝 HOME
Listen to this article

పయనించు సూర్యుడు , ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం.. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామపంచాయతీ ఎర్రాయి చెరువు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్సై అవినాష్ హాజరై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలువెత్తు శిలా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మోహన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగం రచించి దశ దిశ చూపిన వ్యక్తి అంబేద్కర్ అని అందరూ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.. అంటరానితనాన్ని రూపుమాపి సమాజంలో అసమానతలు తొలగించి సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఈ దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ సామాజిక విప్లవాన్ని ఆర్థిక రాజకీయ విప్లవాన్ని తీసుకురావడం జరిగింది తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పిల్లలను నలుగురిని బాబాసాహెబ్ అంబేద్కర్ పోగొట్టుకోవడం జరిగింది అలాగే తన భార్య ప్రాణాలను కూడా పోగొట్టుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మకు నాన్నకు చెప్తున్నా మీయొక్క భవిష్యత్తు బాగుపడాలి అంటే మీ కష్టాలు తొలగిపోవాలంటే దేవుని మీద గాని మహానుభావుడు మీద గాని మీరు ఆధారపడకండి మీ స్వశక్తి నమ్ముకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని నమ్ముకోండి హితవు పలికారు జొన్నాడ రాజారావు ఆధ్వర్యంలో సుమారు వందమంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమం అనంతరం సుమారు 2000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేలాదిమంది అంబేద్కర్ యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Scroll to Top