కల్లూర్ కస్తూర్బా పాఠశాలలో రూ.74 లక్షల అదనపు మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన…

July 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: కుంటాల మండలంలోని కల్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.74 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు *అదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ * శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యా వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రూ.74 లక్షల వ్యయంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిందని తెలిపారు.విద్యార్థినులు ఆధునిక వసతులతో కూడిన విద్యా వాతావరణంలో చదువుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper