దిశా సమావేశంలో ముధోల్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సమీక్ష…
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో *అదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు ముధోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్, వైద్యం, విద్య తదితర కీలక రంగాలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులను త్వరితగతిన మరమ్మతులు చేయడం, సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచి విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలను సమావేశంలో వెల్లడించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.