కుబీర్ రోడ్ల దుస్థితిపై తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ భిక్షాటన
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలు మాలేగాం. సోనారి. కుప్టి వర్ని. అంతర్నీ. వాయి లింగి.పార్డి B.చాత. హల్డా.రంగశివుని తాండ. సాంగ్వి.డోర్న గ్రామం. సిరిపెల్లి గ్రామం. సిరిపెల్లి ఫాఖిర్ నాయక్ తండా.కుబీర్ నుండి వెళ్లే రోడ్లు గుంతలు మాయం కావడంతో తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ గతంలో అనేక సార్లు అధికారులకు రాజకీయ నాయకులకు ఆఫీసర్లకు వినతి పత్రాలు అందించిన ఫలితం లేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేకపోవడం వల్ల రోడ్లు వేయలేకపోతున్నామని పలువురు రాజకీయ నాయకుడు తెలుపగా. అందుకుగాను నిరసన కార్యక్రమం గా కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో. మార్కెట్ లో ఉన్న దుకాణాల్లో. రోడ్డుపైన భిక్షాటన చేయడం జరిగింది.భిక్షాటన చెయ్యగా వచ్చిన డబ్బులను తాసిల్దార్ ఆఫీస్ కు వెళ్లి ఆ డబ్బులను ప్రభుత్వానికి చేరవేయాలని కోరడం జరిగింది.తాసిల్దార్ గారు వినతి పత్రాన్ని తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సమ్జయించడం జరిగింది. వెంబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రోడ్లను మరుమత్తు చేసి ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకు. విద్యార్థులకు.వికలాంగులకు వృద్ధులకు. గుంతల మాయమైన రోడ్డు నుంచి విముక్తి కలిగించాలని ఈ రోడ్ల పైన యాక్సిడెంట్లు కాకుండా కాపాడాలని. ఒకవేళ ఆక్సిడెంట్ లో చనిపోతే కోటి రూపాయల నష్టపరిహారం యాక్సిడెంట్ అయితే 50 లక్షలు ప్రభుత్వాన్ని భరించాలని కొత్తూరు శంకర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా (ఎం ఎస్ ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడేకర్ మహేశ్వర్ తదితరులు పాల్గొనడం జరిగింది