త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
కుందేలు కుంట తండా సర్పంచ్ మేఘవత్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సహకారంతో బోర్లు వేయించడం జరిగింది
( పయనించే సూర్యుడు జూలై 04 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం కుందేలు కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని దేవుని గుట్ట తండా మరియు పోతారాజ్ గడ్డ తండా త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తాండ సర్పంచ్ మెగావత్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ మరియు షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ సహకారంతో తాండాలో రెండు బోర్లను వేయించడం జరిగింది. బోర్లు పూర్తి అయిన తర్వాత మోటర్లు బిగించి మీరు అందించడంతో తండ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రాము కేతావత్ రవి, సభవత్ శివ, కేతావత్ సూర్య, సభవత్ పెంత్య, కేతావత్ రాజు, మేఘవత్ రమేష్, మేఘవత్ లోక, ఉమ్మడి బూర్గుల మాజీ సర్పంచ్ పిర్యా నాయక్, తర్యా, మరియు యువకులు మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.