ఝరి ‘బి’ గ్రామంలో చురుగ్గా ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమం నిర్వహించారు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:మండల పరిధిలోని ఝరి బి గ్రామంలో ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ అర్హులైన వారి వివరాలను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సేకరిస్తున్నారు.గ్రామ ఓటర్ల వివరాలు:స్త్రీలు: 579 మందిపురుషులు: 561 మందిమొత్తం ఓటర్లు: 1140 మంది ఇంటింటికీ తిరుగుతూ ఫారాల పూర్తి:గ్రామంలో బూత్ స్థాయి అధికారి (బి ఎల్ ఓ) మైనాబాయి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ (బి ఎల్ ఎ) గైక్వాడ్ సాయినాథ్ కలిసి ఝరి బి గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. అర్హులైన ఓటర్ల నుంచి దరఖాస్తు ఫారాలను సేకరించి స్వయంగా పూర్తి చేస్తున్నారు.