PS Telugu News
Epaper

కోల్పూర్ మండల ప్రాథమిక పాఠశాలలో విజయవంతమైన తల్లిదండ్రుల సమావేశం

📅 24 Apr 2026 ⏱️ 4:47 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్24 గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నారాయణపేట జిల్లా పరిధిలోని మాగనూరు మండలంలోని కోల్పూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ముద్దు రాములు విశిష్ఠాధితులుగా ఎం జె పి వి సి వ్యవస్థాపకులు కేవీ నరసింహా అతిథులుగా కోల్పూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ అలాగే తల్లి దండ్రులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ పాఠశాలలకు నేటితో 45 రోజుల వరకు సెలవులు ఉంటాయి కనుక పిల్లలు జాగ్రత్తగా ఎండలో తిరగరాదని తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు ఎం జె పి వి సి వ్యవస్థాపక అధ్యక్షులు కెవి నరసింహ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇంకా ఎండ తీవ్రత చాలా ఉంటుందని కనుక పిల్లలు ఎక్కడ బయటికి వెళ్ళరాదని మీకు ఇచ్చిన ప్రోగ్రెస్ లో చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పారు గ్రామపంచాయతీ సర్పంచ్ ముద్దు రాములు మాట్లాడుతూ పాఠశాలను రానున్న కాలంలో ఇంకా సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిమ్మన్న శేఖర్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు శంకర్ అంజప్ప శంకరప్ప అనేక మంది గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థినిలు పాల్గొనే

Scroll to Top