PS Telugu News
Epaper

జూన్ 2 లోపు PRC ప్రకటించాలి: TGE JAC

📅 17 Apr 2026 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఉద్యమిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం: TPUS సంఘం

పయనించే సూర్యుడు ఏప్రిల్18

TGE JAC పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తపస్ సంఘం ఆధ్వర్యంలో మరికల్ మండల తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. TPUS సంఘ జిల్లా కార్యదర్శి మఠం శివ శంకర్. మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలైన PRC అమలు, పెండింగ్ DA ల విడుదల, CPS రద్దు – OPS అమలు, పెండింగ్ బకాయిల విడుదల, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతర సమస్యల ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. అదే విధంగా పలు రకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ రామకోటి కి వినతిపత్రం సమర్పించారు.. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పు పడుతూ పలు శాఖల ఎంప్లాయిస్ నిరసన తెలిపారు..జూన్ 2 లోపు PRC ప్రకటన తో పాటు ఇతర సమస్యల ను వెంటనే పరిష్కరించక పోతే పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్దమని తపస్ సంఘ మండల అధ్యక్ష్య కార్యదర్శి లు సురేశ్ నటరాజ్ హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ కుమార్,ప్రధాన కార్యదర్శి నటరాజ్ ,జిల్లా కార్యదర్శి మఠం శివ శంకర్, సహా కార్యదర్శి రమేష్ కుమార్, మండల కోశాధికారి
జ్ఞానేశ్వర్, గౌరవ అధ్యక్షుడు రాములు గౌడ్,మహిళా కన్వీనర్ జ్యోతి,జిల్లా బాధ్యులు చంద్రమౌళి, శీల సురేష్ ,చంద్ర శేఖర్ ఇతర ఉపాద్యాయులు ఉద్యోగులు పాల్గొన్నారు.

Scroll to Top