PS Telugu News
Epaper

మహిళా భద్రతపై పోలీసుల అవగాహన డ్రైవ్

📅 29 Apr 2026 ⏱️ 6:30 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) శక్తి యాప్ సైబర్ మోసాల పైన 520 మందికి శిక్షణ తడ మండల పరిధిలోని మంబట్టు సెజ్ కొండూరు ప్రాంతాల్లో మహిళా ఉద్యోగుల భద్రతను లక్ష్యంగా చేసుకొని పోలీసు శాఖ బుధవారం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది సర్కిల్ ఇన్స్పెక్టర్ మాకినేని మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మొత్తం సుమారు 520 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మంబట్టు సెజ్‌లోని భారతీ కంపెనీలో సుమారు 400 మంది కొండూరులోని వికేసి ఫుట్వేర్ కంపెనీలో సుమారు 120 మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో భాగమయ్యారు ఈ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై పోలీసు అధికారులు వివరంగా అవగాహన కల్పించారు ప్రత్యేకంగా శక్తి.యాప్ వినియోగం లైంగిక వేధింపులు గృహ హింస నివారణ సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు ఒటిపి మోసాలు వంటి సైబర్ నేరాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని, డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమాల్లో శ్రీహరికోట ఎస్‌ఐ భాను ప్రసన్న, తడ ఎస్‌ఐ కొండప్ప నాయుడు పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలు తమ భద్రతపై అప్రమత్తంగా ఉండటంతో పాటు నేరాల నివారణలో భాగస్వామ్యంగా ఉండాల్సిన అవసరాన్ని సిఐ మురళీకృష్ణ వివరించారు

Scroll to Top