ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా బిజెపి సీనియర్ నాయకులు యళ్ల దొరబాబు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం:
దేశ గౌరవప్రదమైన ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని, బిజెపి సీనియర్ నాయకులు యళ్ల దొరబాబు ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండవచ్చు, కానీ అవి హుందాతనాన్ని దాటకూడదు. అన్-పార్లమెంటరీ వ్యాఖ్యలు: అంతర్జాతీయ వేదికలపై మరియు బహిరంగ సభల్లో దేశ ప్రధానిని ఉద్దేశించి తక్కువ చేసి మాట్లాడటం దేశ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుంది.• ఆధారాలు లేని ఆరోపణలు: ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టమవుతోంది.ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన: రాహుల్ గాంధీ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఇచ్చే కనీస గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రాహుల్ గాంధీ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు యళ్లదొరబాబు డిమాండ్ చేస్తున్నరు