PS Telugu News
Epaper

బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్పంచ్ బాసు నాయక్

📅 14 Apr 2026 ⏱️ 7:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

సిద్దాపూర్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో వేడుకలు

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామపంచాయతీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను సిద్దాపూర్ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సర్పంచ్ బాసు నాయక్ మాట్లాడుతూ… బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆహార్నిశలు కృషిచేసిన మహనీయులు పీడిత ప్రజల కోసం పోరాడిన మహనీయులు సబండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వప్నికుడు. భారత రాజ్యాంగం నిర్మించిన మహానుభావుడు అని ఆడాడు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాసు నాయక్ తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి ఉప సర్పంచ్ దొబ్బల యాదయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి, రాశుల జంగయ్య,ఖాజా గ్రామ వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top