బ్యాంకు మేనేజర్ చేతుల మీదుగా ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమాయోజన చెక్ అందజేత
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ0 పరిధిలో
తడ మండలం కాదలూరు గ్రామంలో కె.జయసుధ ఆరోగ్యం సరిలేనందున మరణించడం జరిగింది.ఈమె గురించి సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ అయిన మేము బ్యాంక్ లో విచారించి, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమాయోజన(పీఎంజెజెబివై)ను బ్యాంకు లో క్లెయిమ్ చేయించాము. పీఎంజెజెబివై ద్వారా రెండు లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పీఎంజెజెబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును ఆమె కుమార్తె కె. సబితా కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ అశ్వన్ కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమాయోజన మరియు ప్రధానమంత్రి సురక్ష భీమాయోజన చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియచేయడం జరిగింది. పై కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సూళ్లూరుపేట బ్రాంచ్ మేనేజర్ అశ్వన్ కుమార్, మేనేజర్ మాధవి, అసిస్టెంట్ మేనేజర్ స్నేహలత,ఫీల్డ్ ఆఫీసర్ కళ్యాణ్ రావ్, ప్రియాంక, తడ వెలుగు ఏపిఎం రాజా రెడ్డి, సీసీ చంద్రయ్య మరియు సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం మరియు వి.ఓ.ఏ. కమలమ్మ పాల్గొనడం జగిరింది.