భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు నుండి తప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేసిన రిపోర్టర్ మీద కేసు నమోదు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పోలీస్ స్టేషన్ లో పురాణిపేట కు చెందిన ఫిర్యాది అతని కొడుకు మీద భీమ్గల్ పి.ఎస్ లో కేసు నమోదు కాగా, అట్టి కేసు నుండి తప్పిస్తామని అందుకు ఫిర్యాదు వద్ద నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేయగా, అతను డబ్బు ఇవ్వకపోయేసరికి అతని షాప్ లోకి వెళ్ళి, బూతు మాటలు తిడుతూ వారి గురించి పేపర్ లో రాస్తామని బెదిరించిన వ్యక్తి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది. ఇట్టి విషయంలో పోలీస్ స్టేషన్ లో పని చేసి పెడతామని, పోలీస్ పేరిట ఎవరైనా వ్యక్తులు, దళారులు,మధ్యవర్తులు, విలేకరులు డబ్బులు అడిగినచో నేరుగా పోలీసులకు సమాచారం అందించగలరు. అదే విధంగా ఎవరు కూడా పోలీస్ సేవలకోసం డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని భీమ్గల్ సి.ఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ తెలిపారు.