రుణమాఫీ చేయమని అడిగినందుకు కమ్మర్ పల్లి బి.ఆర్.ఎస్ నాయకులపై రైతులపై అక్రమ కేసులు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్D. 17 .4 .20 26
ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు బాల్కొండ నియోజకవర్గంలో 52,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇంకా 30,000 మంది రైతులకు రుణమాఫీ చేయనందుకు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కమ్మర్ పల్లి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను, రైతులపై అక్రమ కేసులు పెట్టి గత రెండేండ్లుగా కోర్టుల చుట్టూ తిప్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఈ రోజు శుక్రవారం రోజున ఆర్మూర్ కోర్టులో కేసు హియరింగ్‌కు హాజరైన బి ఆర్ ఎస్ నాయకులు,రైతులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడం సమంజసమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని నెరవేర్చాలని ప్రశ్నించిన బి ఆర్ ఎస్ నాయకులు, రైతులను కోర్టుల చుట్టూ తిప్పించడం అత్యంత బాధాకరమని, ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య ధోరణిని చూపిస్తోందని విమర్శించారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని ,పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని ,రైతులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని వేముల డిమాండ్ చేసారు.లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
