PS Telugu News
Epaper

సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్

📅 14 Apr 2026 ⏱️ 7:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కేశంపేట్ మాజీ జడ్పిటిసి

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తిత్వానికి మా వినమ్ర నివాళులు అని కేశంపేట్ మాజీ జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని. అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని విశాల పేర్కొన్నారు.

Scroll to Top