PS Telugu News
Epaper

సూళ్లూరుపేట పోలీసులు భారీ ఆపరేషన్ గంజాయి దహనం

📅 17 Apr 2026 ⏱️ 6:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 17 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట తడ శ్రీహరికోట పరిధిలో నమోదు అయిన 34 కేసులకు సంబంధించిన భారీ గంజాయి నిల్వలను పోలీసులు నేడు నశింపజేశారు. సుమారు 850 కిలోల గంజాయిని సురక్షితంగా సూళ్లూరుపేట నుండి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ ప్రక్రియను కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్లు సీఐ మురళి కృష్ణ తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత అధికారుల సమక్షంలో గంజాయిని తగలబెట్టారు. అక్రమ మాదకద్రవ్యాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని అధికారులు స్పష్టం చేశారు. ఈ దహనం ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా ముఖ్యమైన ముందడుగు పడిందని తెలిపారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ రవాణాలపై ఉక్కుపాదం కొనసాగుతుందని హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

Scroll to Top