చలివేంద్రాన్ని ప్రారంభించిన పట్టణ సీఐ వీరబాబు
పయనించే మే 20( ముమ్మడివరం ప్రతినిధి) ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అమలాపురం వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం ఉదయం సినిమా రోడ్డు నందుగల యర్రమిల్లి వారి పెట్రోలుబంకు వద్ద అమలాపురం పట్టణ సిఐ పి. వీరబాబు ప్రారంభించారుఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకై వీరు చేస్తున్న సేవ చాలా హర్షినియమని ఈ వేసవి కాలంలో వివిధ ప్రాంతాలలో ప్రతిరోజు వందలాది మంది దాహార్తిని తీర్చడం మంచి విషయమని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు( విస్సు), ముఖ్య సలహాదారు నంబూరి విశ్వనాథం,కార్యదర్శి నూలు సూరిబాబు, కోశాధికారి శ్రీకాకోలపు రాంపండు, తదితర సభ్యులు పాల్గొని వారి సేవలను అందించారు.