తెలంగాణ ఆవిర్భావ దినం నాటికినూతన ఆరోగ్య కార్డులు హర్షనీయం
మహిళా ఉద్యోగులకు, సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
తపస్ నారాయణ పేట్ జిల్లా శాఖ
:పయనించే సూర్యుడు మే22 మక్తల్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కోసం ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రతిష్టాత్మకంగాఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించి నందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంజిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నరసింహ, రవీందర్ ప్రకటనలో స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నాటికి హెల్త్ కార్డుల జారీ కోసం డేటా బేస్ అప్డేట్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎదురవుతున్న రెండు ముఖ్య అంశాలను అందులో తప్పకుండా చేర్చాలని ఆరు డిమాండ్ చేశారు.ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన వాళ్లలో సిపిఎస్ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారని వారికి ఏ విధంగా ఆరోగ్య కార్డులు అందిస్తారు, వారి పెన్షన్ నుండి ఎలా నిర్ణయం చేసుకుంటారు, వారిపై ఆధారపడిన వారిని హెల్త్ కార్డుల్లో ఎలా చూపించాలో స్పష్టత ఇవ్వలేదు. దీనిపై రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైన సమయంలో భార్య తల్లిదండ్రులను తన హెల్త్ కార్డులో చేర్పించుకోవడం కోసం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డేటా అప్డేట్ గడువు ముగిసేలోపు వీటిపై పూర్తి స్పష్టత ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.