భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి
పయనించే సూర్యుడు 21 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరియు వినాయక నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నగేష్ రెడ్డి చేతుల మీదుగా పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్,మేయర్ ఉమారాణి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ ఉగ్రవాదుల చేతిలో మరణించిన తర్వాత 1984 రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశంలో పెను మార్పులు తీసుకురావడం జరిగిందని, మహాత్మా గాంధీ ఆశయం మేరకు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కొరకు నేరుగా గ్రామపంచాయతీలకు నిధులు వచ్చే విధంగా 73, 74 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారనీ, టెలి కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేసింది రాజీవ్ గాంధీ ని, దేశంలో జపాన్ టెక్నాలజీతో మారితి నానో కార్ ను ప్రవేశపెట్టింది రాజీవ్ గాంధీ గారీ ప్రోత్బలంతోనేనని అన్నారు. 1991లో తమిళనాడులోని పెరంబత్తూరులో తీవ్రవాదులు రాజీవ్ గాంధీ ని చంపడం జరిగిందని, రాజీవ్ గాంధీ ని హతమార్చిన ఈరోజు ను ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం గా ప్రకటిస్తున్నామని, ఆయన సేవలను ఆశలను దేశ ప్రజలు ముందుకు తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలని నగేష్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబమని,ć రాజీవ్ గాంధీ దేశానికి సేవలను దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నటికి మర్చిపోలేరు అని నగేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు వెళుతుంది అని, రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని కచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ని ప్రధానిగా చేస్తామని నగేష్ రెడ్డి అన్నారు.మే 21… మన దేశ చరిత్రలో ఒక అత్యంత విషాదకరమైన రోజు. భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి నడిపించిన మహానాయకుడు, ‘భారత రత్న’, మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి. దేశం కోసం తన ప్రాణాలనే అర్పించిన ఆ అమరవీరుడికి ఈ సందర్భంగా మనం ఘన నివాళులు అర్పిస్తున్నాము.ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవస్తలం,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తారా చాంద్, కౌడపు శరత్,వేంపల్లి రత్నాకర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, కంజర్ రవి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఏసీ అధ్యక్షులు లింగం,జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, మాక్లూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవి,సీనియర్ నాయకులు మీసాల సుధాకర్, జావీద్ అక్రమ్,నగర కాంగ్రెస్ కోశాధికారి సకినాల శివ ప్రసాద్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు రవి,ముల్గురి గణేష్, లింబాద్రి సుభాష్,పులి డైరెక్టర్ రఘు,జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, అవిన్,సంగెం సాయిలు, కిస్టా గౌడ్, పోలా ఉష, అపర్ణ, స్వప్న, బంటు బలరాం,రాజేంద్ర ప్రసాద్,రాజేందర్,గోవర్దన్, సృజన,మహేందర్,అదే ప్రవీణ్, రాజ్ గగన్ భీంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ టౌన్ అధ్యక్షుడు పర్స అనంతరావు సీనియర్ నాయకుడు చెప్పాల గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు