భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కి ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు.

May 21, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 21 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారత దేశ మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు కార్యకర్తల సమక్షంలో పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు,ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణల సృష్టికర్త, మాజీ ప్రధాని, ప్రపంచం ముంగిట నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణల పుణ్యమే,అలాగే విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి,ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలు అని చెప్పి ఐటీ రంగానికి పితామహుడుగా, టెలి కమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడుగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీ ది ఎన్నటికీ చెరగని ముద్ర వేశారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు , యువతకు 18ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ పాలన ఆచరణీయం. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకం అని వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్,మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చెన్న, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి,డీసీసీ నాయకులు మురళి,తక్కురి దేవేందర్ తిప్పిరెడ్డి శ్రీనివాస్ బోనగిరి లక్సమణ్ కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సల్లూరి గణేష్ గౌడ్ కాంగ్ర పార్టీ నాయకులు బుచ్చి మల్లయ్య,అలకుంటా రాజేష్ ,వన్నెలా రాజేశ్వర్, ,నిమ్మ రాజేంద్రప్రసాద్,శివసరం గణేష్,సుమన్, మారుపక నరేష్,సుంకరి విజయ్,కౌడా శైలేందర్, అజర్,పాషా,తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper