ఈ రోజు ఉదయం బాసర మహంకాళి ఆలయంలో జరిగిన చోరీ ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్

June 23, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఈ రోజు ఉదయం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం పైఅంతస్తులోని మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం, హుండీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మహంకాళి ఆలయ గేటు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు కాజేసి.. అనంతరం హుండీ వ్యాసగుడి దగ్గర పడేసి పరారయ్యారు. అర్చకులు మంగళవారం తెల్లవారుజామున పూజ కోసం వెళ్లి చూడగా చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ సందర్భంగా ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ పరిశీలించి, చోరీ జరిగిన పరిస్థితులు, సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘటనకు సంబంధించిన ప్రతి కోణంలో దర్యాప్తు చేపట్టి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.ఆలయ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్,సమ్మయ్య, ఎస్ఐ లు ఇతర పోలీసు సిబ్బంది , దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper