
పయనించే సూర్యుడు ఆగస్టు 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
ఎర్ర జెండా ముద్దుబిడ్డ, సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాదులో శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ అస్తమించారు. యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో శనివారం యాడికి సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఎర్రజెండా ముద్దుబిడ్డ విద్యార్థి, యువజన ,నిరుపేద, బడుగు బలహీన వర్గాల, కర్షక ఉద్యమ నిర్మాత, అలుపెరుగని పోరాట నాయకులు ఆయన 1998, 2004లో పార్లమెంటు సభ్యులుగా అనేక పార్లమెంటు కమిటీలలో సభ్యులుగా ఉన్నారు ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అన్నారు. యాడికి సిపిఐ మండల సమితి విప్లవ జోహార్లు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు, చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ, సిపిఐ పట్టణ కార్యదర్శి కుళాయి రెడ్డి, సిపిఐ నాయకులు రసూల్ రామయ్య రంగస్వామి వెంకట స్వామి పుట్లూరు నరసింహులు సుబ్బారావు మాబూ రఫీ షేక్షావలి రమేష్ చైతన్య శివ పాల్గొన్నారు
