బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వైభవంగా వ్యాస పూర్ణిమ వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: బాసర అమ్మవారి క్షేత్రంలో వైభవంగా వ్యాస పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వ్యాస పూర్ణిమ వేడుకలు వైభవ పేతంగా జరిగాయి. బుధవారం వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని ఎమ్మెల్యే పవా ర్ రామరావు పటేల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బాల ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, వ్యాసలయంలో పూజలు చేసి, వేద పండితులు చేపట్టిన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే తో పెద్ద మొత్తంలో సర్పంచులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.