ఎలినో ప్రభావం, ఉపశమన చర్యలపై రైతులకు అవగాహన
పయనించు సూర్యుడు ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కాట్రేనికోన రైతుసేవ కేంద్రంలో ఖరీఫ్ 2026 ఎలినో ప్రభావం, కార్యాచరణ ఉపశమన ప్రణాళికపై మండల వ్యవసాయాధికారి బి మృదుల ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు రాజశేఖర్ పాల్గొన్నారు. ఎలినినో ప్రభావంపై ముందస్తు అంచనాల నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వర్షాభావ పరిస్థితులు, ప్రస్తుత పంట పరిస్థితి, నీటి కొరత వలన పంట వాడిపోవడం, చీడ పీడల ఉధృతి, ఉద్యావన పంటల పరిస్థితి, ఎలినో కారణంగా సంభవిస్తున్న పర్యావరణ మార్పులు, వాటి ప్రభావం గురించి రైతులకు వివరించారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏడుకొండలు ఘన, ద్రవ జీవామృతం, ఎలినినో ప్రభావం, వాటి నివారణ చర్యల గురించి, మత్స్య శాఖ నుండి విజయకుమార్ చెరువులపై ఎలినినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడారు. మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ పంటల బీమా, ఎలినినో నివారణపై అన్ని శాఖలు చెప్పిన విషయాలను రైతులు అందరూ పంటల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ సంచాలకులు విత్తనాల బుజ్జి, నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు శీలం సూర్యనారాయణ, కంచర్ల రామకృష్ణ, పిల్లి ధర్మారావు, దంతులూరి సూర్యనారాయణ వర్మ, దంగేటి నాగరాజు, అధిక సంఖ్యలో రైతులు, కాట్రేనికోన మండల వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.