PS Telugu News
Epaper

తపస్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు..

📅 14 Apr 2026 ⏱️ 2:18 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 14మక్తల్ }

మక్తల్ పట్టణంలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తపస్ నాయకులు పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల లో తపస్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డా. బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి కార్యక్రమ సమావేశంలో తపస్ జిల్లా నాయకులు రవీందర్, నాగార్జున. మాట్లాడుతూ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు, న్యాయకోవిధుడు, రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ ప్రదాత,ప్రగాఢ దేశభక్తుడు అయిన అంబేద్కర్ ను కులం ఆదారిత రిజర్వేషన్ అంశానికి పరిమితం చేయడం శోచనీయమని, అంబేద్కర్ కేవలం స్వతంత్ర భారతదేశాన్ని మాత్రమే ఊహించలేదు, న్యాయ సమ్మతమైన ఒక విశ్వ గురువుగా భావించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, మక్తల్ మండల అధ్యక్ష,కార్యదర్శులు నరసింహ, రాకేష్ కుమార్ మాగనూరు మండల అధ్యక్షుడు బాబురెడ్డి, తపస్ సభ్యులు రాజాంజనే యులు, జగదీశ్, రవీందర్ రెడ్డి,నరేష్, సురేష్, ప్రవర్ధన్ రెడ్డి, నర్సిములు, రమేష్, శివరాజ్,పిటిఐ నర్సిములు, తపస్ సీనియర్ నాయకులు దేవరీ నర్సిములు . తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top