PS Telugu News
Epaper

అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమం

📅 14 Apr 2026 ⏱️ 3:54 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

అంబేద్కర్ సాక్షిగా రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14, అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని టీడీపీ సెంటర్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రహదారి ప్రమాదాల నివారణ మరియు ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా ఈ అవగాహన సదస్సు జరిగింది.ఈ కార్యక్రమంలో అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, ఎంపీడీవో శ్రీ ముత్యాల రావు, సి.ఐ అశోక్ రెడ్డి,ఎం.ఆర్.ఓ సూర్య ప్రకాష్ మరియు ఎం.పీ.డీ.వో ఆఫీస్ యుడిసి పద్మావతి , వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు ప్రజలందరితో రహదారి నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మరియు అతివేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై సి.ఐ అశోక్ రెడ్డి మరియు ఎంపీడీవో సూచనలు ఇచ్చినారు.

Scroll to Top