PS Telugu News
Epaper

ప్రజలు సైబర్ నేరాలు, చట్టాల మీద అవగాహన, డ్రగ్స్ నిషేధం,రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: కాట్రేనికోన ఎస్సై అవినాష్

📅 18 Apr 2026 ⏱️ 2:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

​ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారి ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి శ్రీ టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మోహన్ కుమార్ వారు పర్యవేక్షణలో, ఈరోజు కాట్రేనికోన మండలం, వేట్లపాలెం గ్రామంలోని మహిళలకు , గ్రామస్తులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ఈ కార్యక్రమంలో కాట్రేనికోన ఎస్సై శ్రీ అవినాష్ పాల్గొని సైబర్ క్రైమ్స్, చట్టాల మీద అవగాహన, డ్రగ్స్,రోడ్డు భద్రత, మరియు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.​కార్యక్రమంలోని ముఖ్యాంశాలు:​సైబర్ నేరాలు: సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని ఎస్సై హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.రోడ్డు భద్రత: మైనర్లు వాహనాలు నడపకూడదని, రహదారి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. హెల్మెట్ ధరించడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడంపై అవగాహన కల్పించారు.మహిళలు & చిన్నారుల రక్షణ: మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల గురించి వివరించారు. ఏదైనా ఆపద కలిగితే ‘100’ లేదా ‘112’ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పట్ల చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.​ఈ కార్యక్రమంలో, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top