PS Telugu News
Epaper

మట్టిలో మాణిక్యం చదువుల సరస్వతి రత్నశ్రీ & సత్యనారాయణ

📅 18 Apr 2026 ⏱️ 3:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఏప్రిల్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థినీ డేగల రత్నశ్రీ విద్యార్థి ముళ్ళ సత్యనారాయణ ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోని మండలం ఉప్పూడి గ్రామ మాజీ సర్పంచ్ రంబల రమేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రంబల దొరబాబు అభినందించి వారికి సీల్డ్ ను బహుకరించారు ఈ సందర్భంగా రంబల రమేష్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రభుత్వ కళాశాలలో చదువుకుని మంచి మార్కులను సాధించి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని కొనియాడారు ఇంటర్మీడియట్ పరీక్షలో డేగల రత్నశ్రీ 1000/976 మార్కులు ముళ్ళ సత్యనారాయణ 1000/962 మార్కులను సాధించి వారి ప్రతిభను చాటుకున్నారు ఇలాంటి మరెన్నో అద్భుతాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాగాపు పట్టాభి పోలిశెట్టి నాగబాబు జొన్నాడ రాజారావు ర్యాలీ బద్రి తదితరు పాల్గొన్నారు

Scroll to Top