అధికారికంగా వాసవి మాత జయంతి* *సీఎం,మంత్రి, చైర్మన్ లకు పాలభిషేకం చేసిన ఆర్యవైశ్యులు**తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కొత్త శ్రీనివాస్
పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 25 మక్తల్}తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం ఆర్యవైశ్యులందరికి గర్వకారణం అని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మక్తల్ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా అన్నారు. వాసవి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి తో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత కు ఆర్యవైశ్యుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి,మంత్రి వాకిటి శ్రీహరికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకు ఆర్యవైశ్య నాయకులు పాలభిషేకం చేశారు.శుక్రవారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తూ అమ్మవారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. ప్రజలందరితో మమేకమై సేవా కార్యక్రమాలలో ముందుండే ఆర్యవైశ్యుల పట్ల పాలక ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆర్యవైశ్య సంఘం,మహిళ సంఘము, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు .ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్యుల తరఫున చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి ,మంత్రిమండలి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని కొత్త శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. మరోమారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రిమండలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో నిర్వహించిన వాసవి మాత పారాయణం గిన్నిస్ బుక్ రికార్డు నమోదు చేసుకుందన్నారు . ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల విజ్ఞప్తిని మన్నించిన ముఖ్య మంత్రి వాసవి మాత జయంతికి నాలుగు రోజుల ముందే అధికారికంగా వాసవి మాత జయంతి వేడుకలను నిర్వహిస్తూ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆర్యవైశ్య సమాజం ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు. ఆర్యవైశ్యులంతా రాష్ట్ర ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు .ఈనెల 26న వాసవి మాత జయంతి సందర్భంగా మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి పుష్కరిణి (కోనేరు) నుండి 108 కళాశాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు శోభాయాత్ర, అభిషేకం, సామూహిక కుంకుమార్చన, అమ్మవారికి ఒడి బియ్యం, అన్నదానం మిగిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ వేడుకల్లో ఆర్యవైశ్యులు ,హిందూ బంధువులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వాసవి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం ముఖ్యమంత్రి, మంత్రులకు కట్ట సురేష్ కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘం పెద్దలు మనసాని వెంకటేష్ గుప్తా, బిలకంటి జగదీష్ ,దొంత నరహరి,మనసాని నాగరాజు, కల్వ శ్రీనివాస్, ఉదయ్, బిలకంటి నరసయ్య ,వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ ,వనిత క్లబ్ అధ్యక్షురాలు కల్వాల ప్రసన్న , మహిళ సంఘము మజీ అధ్యక్షులు మనసాని సరళ దేవి, పాలుట్ల సుష్మ, చల్ల రూప,తదితరులు పాల్గొన్నారు.