PS Telugu News
Epaper

దేగాం లో మహిళ సమైక్యభవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

రాష్ట్రములోనే మొదటి సారిగా భవన నిర్మాణమై ప్రారంభం సర్పంచ్ సుష్మరెడ్డి పని తీరు పట్ల అభినందన

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శనివారం భైంసా మండలం లోని దేగాం గ్రామం లో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ మహిళ సంఘభవనాన్ని ప్రారంభించిన సందర్భంగా అయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం నిధుల తో సంఘ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. భైంసా మండలానికి 40 కి పైగా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చే యడం జరిగిందన్నారు. రాష్టంలో నే మొదటి సారిగా భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించినందుకు సర్పంచ్ సుష్మరెడ్డి, అధికారుల పని తీరును అయన అభినందించారు.. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలు విన్నవించడం తో దశల వారిగా గ్రామ అభివృద్ధి కి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. సిరాల ప్రాజెక్ట్ ద్వారా దేగాం ఆయకట్టుకు సాగునీరు అందించాలని కోరగా, కొన్ని చోట్ల మచ్కల్ సమీపంలో కాలువను తవ్వేశారని 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి కాలువ ను పూర్తి స్థాయి లో నిర్మించి సాగునీటిని అందిస్తామన్నారు… అభివృధ్యే ధ్యేయం గా తాను ముందుకు సాగుతున్నాని, 28 ప్యాకేజి పూర్తి అయితే నియోజకవర్గం సస్యశామలం అవుతుందన్నారు. అదే విధంగా భూగర్భజాలలను పెంచేందుకు ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని డి. ఆర్. డి. ఎ. పి డి. విజయలక్ష్మి సూచించారు. అనంతరం సర్పంచ్ సిరం సుష్మ రెడ్డి మాట్లాడుతూ తాను ఒక సామాన్య మహిళ నుండి సర్పంచ్ గా కావడం లో గ్రామస్తుల ఎమ్మెల్యే సహకారం ఎంతో ఉందన్నారు.. గ్రామ అభివృద్ధి కి దశల వారిగా నిధులు ఇస్తున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు చెప్పారు.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కు గ్రామస్తులు, మహిళా సంఘ సభ్యులు స్వాగతించి శాలువ తో సత్కరించారు.. కార్యక్రమం లో అధికారులు, నాయకులు, ఆయా గ్రామల సర్పంచ్ లు పాల్గొన్నారు.

Scroll to Top