PS Telugu News
Epaper

సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ( గుట్ట బాబు)

📅 25 Apr 2026 ⏱️ 6:11 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 25 కడప డిస్టిక్ టి సుండుపల్లి మండలం

విజయవాడ పట్టణంలోని జై బేరి అపార్ట్మెంట్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ల ఆత్మీయ సమావేశంలో టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం, చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు సంజీవరెడ్డి సవిత హాజరై రాష్ట్ర కన్వీనర్లకు మార్గనిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర కన్వీనర్లకు మంచి భవిష్యత్తు ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర కన్వీనర్లు అహర్నిశలు కష్టపడి తెలుగుదేశం పార్టీని విజయపథంలో నడిపించారని గుర్తుచేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన కన్వీనర్లు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి జోనల్ కోఆర్డినేటర్లు చంద్రశేఖర్ శ్రీనివాసులు,మరియు రాష్ట్ర కన్వీనర్లు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర కన్వీనర్లను శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.అలాగే, సవితమ్మ గారిని శివప్రసాద్ నాయుడు మరియు కన్వీనర్ చక్రధర్, వడ్డే వెంకట్ , ఉమాకాంత్ ఘనంగా సత్కరించారు.

Scroll to Top