PS Telugu News
Epaper

జర్నలిస్టు హత్యను ఖండించిన ప్రెస్ క్లబ్

📅 29 Apr 2026 ⏱️ 1:18 PM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ; డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం వీ.కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డిని కొంతమంది కత్తులతో హత్య చేయడాన్ని కాట్రేనికోన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పాత్ర పోషించే జర్నలిస్టులపై హత్యలకు తెగబడడం క్రూరమైన చర్య అని అధ్యక్షుడు పిఎస్ నాయుడు అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి నియంతృత్వ పోకడలు సరికాదన్నారు. నిందితులను వెంటనే గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంబాల మహావిష్ణు, మట్టపర్తి రవీంద్రనాథ్,జగడం శ్రీనివాసరావు,,నేలపాటి నాని బాబు, గంటి సుభాష్ చంద్రబోస్, జీ బ్రహ్మాజీ, మట్టపర్తి శ్రీహరిరావు, గ్రంధి నానాజీ, కొంకి రవి, జగడం శ్రీనివాస్, పివి రమణ, అయితా బత్తుల శీను బాబు, ఎన్ రాంబాబు, పండు బాబు,చక్రి, బి శ్రీను, తాడి శ్రీను, వి భైరవ స్వామి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top