PS Telugu News
Epaper

​ కుల మత బేధం లేకుండా నవజీవన్ ఆర్గనైజెషన్‌ పనిచేస్తుంది

📅 29 Apr 2026 ⏱️ 6:58 PM 📝 HOME
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతిజిల్లా వెంకటగిరి
ప్రధాన కార్యాలయంగా సమాజంలోని కుల మత భేదం లేకుండా అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నవజీవన్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది అని మరియు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా వ్వర్ధాలను సేకరించే వారు మరియు సుభ్రం చేసేటటువంటి వేస్ట్ పిక్కర్స్ మరియు సఫాయి కర్మచారీలను పారిశ్రామిక వేత్తలును చేసి వారి జీవన విధానంలో మార్పు తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని నవజీవన్ ఫౌండర్ మరియు చైర్మన్ కాలవపల్లి సహదేవయ్య తెలిపారు. ​ఇందులో భాగంగానే నాయుడుపేట పట్టణ పరిధిలో నిరాశ్రయులుగా ఉంటూ రోడ్లపై చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబాలు మరియు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అంబేద్కర్ భవన్ లో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు
​ఈ సందర్భంగా నవజీవన్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ శ్రీమతి కె. విక్టోరియా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికీ కొన్ని వర్గాల ప్రజలు దుర్భర జీవితాన్ని గడపడం చాలా బాధాకరమన్నారు ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSKFDC) ద్వారా చెత్త ఎరుకునేవారికి పారిశుద్ధ్య కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తోందని గుర్తుచేశారు ​అర్హులైన ప్రతి ఒక్కరికీ NSKFDC ద్వారా తగిన గుర్తింపు మరియు ప్రభుత్వ సహాయ సహకారాలు అందేలా తమ సంస్థ పూర్తి బాధ్యత తీసుకుంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఇ. కుప్పయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది మరియు నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి, కోఆర్డినేటర్ గౌరి, ఇతర నవజీవన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top