
నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 17 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని,వివిధ శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి వాటికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. షాద్నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై నిరంతరం దృష్టి సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందె మోహన్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, శేఖర్ రెడ్డి, కుమారస్వామి గౌడ్, రమేష్, రాయికల్ శ్రీనివాస్, పురుషోత్తం రెడ్డి, జాకారం శేఖర్, శ్రీధర్, ఆర్డీఓ సరిత, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ లు పాల్గొన్నారు.