సినిమా వార్తలు

22A నిషేధిత భూముల పేరుతో పేదలను వేధిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదు!

22A నిషేధిత భూముల పేరుతో పేదలను వేధిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదు!

పయనించే సూర్యుడుD,29,10,2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, అటవీ అధికారుల వేధింపులను ఆపాలి – డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో రాజకీయ పక్షపాతం విడనాడాలి-. నవంబర్ 02 నాడు ఛలో సబ్ కలెక్టర్ కార్యక్రమం ను విజవంతం చేయండి.అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర అధ్యక్షులు V. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి B. దేవారం డిమాండ్ బీంగల్ మండలంలోని రహత్ నగర్, తాళ్లపల్లి, దేవునిపల్లి గ్రామాల్లో గురువారం నాడు నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశాల్లో అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర అధ్యక్షులు V. ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి B. దేవారం మాట్లాడుతూ, 22A నిషేధిత భూముల పేరుతో పేదలను, రైతులను వేధిస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలు, రైతులను భూముల సమస్యల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం న్యాయబద్ధంగా పరిష్కరించాలని, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అటవీ అధికారులు ప్రజను వేధింపులకు గురిచేయకుండా, భూముల సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని కోరారు.అలాగే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు. ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలను గుర్తించి, ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా నిజమైన అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ అనుబంధాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ అందాలని స్పష్టం చేశారు.పేదల భూములకు రక్షణ కల్పించడం, అటవీ అధికారుల వేధింపులను అరికట్టడం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించడం ప్రభుత్వ బాధ్యత అని నాయకులు అన్నారు. పేదలు, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.పేదలు, రైతులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని, భూముల సమస్యల పరిష్కారం కోసం, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు కోసం జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని V. ప్రభాకర్, B. దేవారం పిలుపునిచ్చారు.కార్యక్రమంలో దేవునిపల్లి సర్పంచ్ లాకవత్ శేఖర్, ఉపసర్పంచ్ గంగసాయిలు, మాజీ సర్పంచ్ గడ్డ గంగారాం, మాజీ ఉపసర్పంచ్ మాలవ్ రాంచందర్, CPI(ML) మాస్ లైన్ జిల్లా నాయకులు కె రాజేశ్వర్, AIUKS ప్రధానకార్యదర్శి ఆర్ దామోదర్, డివిజన్ నాయకులు జిలకర నడిపినర్సయ్య, బి శ్రావణ్, జి మోహన్, బొగ్ధం ప్రసాద్, B చిన్నగంగారాం, B,ధర్మపురి, భూక్య నరేష్, B దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS