
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి దృష్టి లోపంతో బాధపడుతున్న దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా, స్వతంత్రంగా సమాజంలో తిరగడానికి మొబిలిటీ స్టిక్స్ ఎంతో దోహదపడతాయని డాక్టర్ జోక్ దండే చంద్రకాంత్ పేర్కొన్నారు. స్థానిక భైంసా పట్టణంలోని పి ఆర్ టి యూ భవన్ లో నిర్వహించిన ఒక ప్రత్యేక సేవా కార్యక్రమం లో భాగంగా 30 మంది దృష్టి లోపం ఉన్న దివ్యాంగులకు ఉచితంగా మొబిలిటీ (వాకింగ్) స్టిక్స్‌ను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జోక్ దండే చంద్రకాంత్,ఎల్వి ప్రసాద్ బాబురావు,ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్ట్ దిగంబర్,దివ్యాంశక్తి ఫౌండేషన్ ఫౌండర్ పంచగుడి మహేష్, శ్యామ్,లక్ష్మణ్,పరమేష్, సాయి,ప్రముఖులు మాట్లాడుతూ.. దివ్యాంగులకు సహాయం చేయడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సాధారణంగా దృష్టి లోపం ఉన్నవారు నడవడానికి పడే ఇబ్బందులను తొలగించేందుకు, వారు సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ ఆధునిక స్టిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.సర్వే ద్వారా గుర్తించిన అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన 30 మంది దృష్టి బాధితులను ఎంపిక చేసి ఈ స్టిక్స్ అందించారు.ఈ చేతికర్రల సాయంతో వారు రోడ్లపై, ఇళ్లలో అడ్డంకులను గుర్తిస్తూ సులభంగా నడవగలరని, ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.మొబిలిటీ స్టిక్స్ అందుకున్న దివ్యాంగులు తమ నడకకు ఈ కర్రలు ఎంతో ఆసరాగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేస్తూ, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.