సినిమా వార్తలు

ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయని ప్రజా నాయకుడు – తుఫానులోనూ జనం మధ్యలోనే దాట్ల సుబ్బరాజు

ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయని ప్రజా నాయకుడు – తుఫానులోనూ జనం మధ్యలోనే దాట్ల సుబ్బరాజు

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన : తుఫాను ప్రతికూల వాతావరణంలోనూ ప్రజల కోసం నిరంతరం పర్యటిస్తూ ప్రజల కష్టాల్లో అండగా నిలిచే నాయకుడిగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు నిలుస్తున్నారు. కాట్రేనికోన మండలంలోని పల్లం, చిరయానం, బలుసుతిప్ప గ్రామాల్లో ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా కల్పించేందుకు దాట్ల సుబ్బరాజు ప్రతికూల వాతావరణంలోనూ పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్యకు వెళ్లి, వారి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలు సక్రమంగా అందేలా అధికారులకు సూచించారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారి పక్కనే నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న నాయకుడిగా దాట్ల సుబ్బరాజు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇంచార్జ్ దాట్ల పవన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, దండుబోలు సత్యం, బొమ్మిడి లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS