సినిమా వార్తలు

తీర ప్రాంతంలో తుఫాను బీభత్సం.. బాధితుల చెంతకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాధుర్

తీర ప్రాంతంలో తుఫాను బీభత్సం.. బాధితుల చెంతకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్ మాధుర్

పయనించే సూర్యుడు అక్టోబర్ 28, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో తాళ్లరేవు మండలంలోని తీర ప్రాంత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ విస్తృతంగా పర్యటించారు. భైరవపాలెం గ్రామంతో పాటు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, జలమయమైన ప్రాంతాలను, తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను, నష్టాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ భరోసా ఇచ్చారు. బాధితులు అధైర్యపడవద్దని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం తుఫాను ముప్పును ముందుగానే గుర్తించి ప్రజల రక్షణ కోసం అనేక ముందస్తు చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో భోజనం, మంచినీరు తదితర సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. తుఫాను వల్ల నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా, నష్టాల అంచనా ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన బాధితులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS