సినిమా వార్తలు

కుమారుడి పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమం

కుమారుడి పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన పవర్ శంకర్ కుమారుడు పవర్ రుద్రాంష్ పుట్టినరోజును మానవత్వం నిండిన సేవతో జరిపించిన నిర్మల్ జిల్లా భైంసా సుభాష్ నగర్ కు చెందిన పవర్ శంకర్ & పూజిత బిడ్డ పుట్టినరోజంటే కేకులు, వేడుకలు మాత్రమే కాదు ఆ ఆనందాన్ని ఆదరణకు నోచుకోని వారి ముఖాల్లో చిరునవ్వుగా చూడాలనే ఆలోచన ఎంతో గొప్పది.తమ కుమారుడు పవర్ రుద్రాంష్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు పవర్ శంకర్ గారు, పూజిత గారు వినూత్నంగా ఆలోచించి, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు, ఆదరణ కరువైన వృద్ధులకు, రోడ్లపై నివసించే అభాగ్యులకు, మతిస్థిమితం లేని వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..తమ బిడ్డ ఆనందంలో మరికొందరి ఆకలి తీర్చడం.. తల్లిదండ్రులుగా వారు అందించిన గొప్ప సంస్కారం. ఇలాంటి మంచి ఆలోచనలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి.పవర్ శంకర్ గారు,పూజిత గారికి హృదయపూర్వక అభినందనలు. చిన్నారి పవర్ రుద్రాంష్‌కు ఆయురారోగ్యాలు, సంతోషాలతో నిండిన భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS